ప్రస్తుతం మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా ఓ కొత్త విలన్ తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. అతనే అరుణ్ విజయ్. ఈయన ప్రస్తుతం కోలీవుడ్‌లో జోరు మీదున్న ప్రతినాయకుడు. ఇటీవల వచ్చిన అజిత్ మూవీ ‘ఎంతవాడుగానీ’ చిత్రంతో ఆయన తెలుగు ప్రేక్షకులను ఆల్‌రెడీ పలకరించి ఉన్నాడు. ఈ చిత్రంలో అరుణ్ విజయ్ విలనిజంకు మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రంలో అరుణ్ పెర్ఫార్మెన్స్ రామ్‌చరణ్‌కు తెగనచ్చేసిందిట. దీంతో చరణ్ సినిమా విలన్ కోసం సంప్రదించడం, అందుకు అరుణ్‌విజయ్ ఓకే చెప్పేయడం జరిగిపోయింది. ప్రస్తుతం అరుణ్‌కు సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరణ జరుగుతోంది.ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే