Advertisementt

పాపం..ప్రభాస్ హ్యాండిచ్చాడు!

Wed 15th Jul 2015 03:30 AM
prabhas,bahubali,sujit,uv creations,ss rajamouli  పాపం..ప్రభాస్ హ్యాండిచ్చాడు!
పాపం..ప్రభాస్ హ్యాండిచ్చాడు!
Advertisement
Ads by CJ

ప్రభాస్.... ఇప్పుడు ఈ యువకథానాయకుడే హాట్‌టాపిక్. ‘బాహుబలి’ విడుదల తర్వాత ప్రభాస్ ఇమేజ్ తారా స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా ఇప్పుడు స్టార్ డైరెక్టర్లు, బడా నిర్మాతలు, కార్పోరేట్ సంస్థలు ప్రభాస్ డేట్ల కోసం క్యూలు కడుతున్నారంటే అతిశయోక్తి కాదు. అయితే ప్రభాస్ మాత్రం తన దృష్టంతా ‘బాహుబలి-2’పైనే పెట్టాడు. మొదట్లో ‘బాహుబలి’ తర్వాత ‘రన్ రాజా రన్’ ఫేం సుజిత్ దర్శకత్వంలో తన సొంత బ్యానర్ యువీ క్రియేషన్స్‌లో ఓ చిత్రం చేస్తున్నానని ప్రకటించాడు. అయితే ఇప్పుడు ‘బాహుబలి’చిత్రానికి వస్తున్న స్పందన, వసూళ్లు చూసి ఉబ్బితబ్బిబవుతున్న ఈ యంగ్ రెబల్‌స్టార్ వెంటనే ‘బాహుబలి-2’ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో సుజిత్ దర్శకత్వంలో నటించబోయే సినిమాను రద్దు చేసుకున్నాడు. సెప్టెంబరు నుంచి ‘బాహుబలి-2’ చిత్రం షూటింగ్‌లో ప్రభాస్ జాయిన్ కాబోతున్నాడు. సో.. ఎంతైనా ప్రభాస్‌ది తెలివైన నిర్ణయమని అంటున్నారు అందరూ. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ