Advertisementt

ఫ్లాప్‌ డైరెక్టర్‌తో మెగాహీరో!

Wed 15th Jul 2015 08:13 AM
sai dharam tej,suneel reddy,subrahmanyam for sale,anil ravipudi  ఫ్లాప్‌ డైరెక్టర్‌తో మెగాహీరో!
ఫ్లాప్‌ డైరెక్టర్‌తో మెగాహీరో!
Advertisement
Ads by CJ

నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా ‘ఓం’ అనే 3డీ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సునీల్‌రెడ్డికి ఆ సినిమా నిరాశనే మిగిల్చింది. చాలాకాలం తర్వాత సునీల్‌రెడ్డికి  మెగాఆఫర్‌ దక్కింది. అతనితో సినిమా చేయడానికి మెగాఫ్యామిలీ హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఓకే చెప్పాడు. సాయిధరమ్‌తేజ్‌ హీరోగా ఓ యాక్షన్‌ ఫిల్మ్‌ చేసేందుకు సునీల్‌రెడ్డి ప్లాన్‌ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ ఎక్కువ భాగం శ్రీలంకలోని సుందర ప్రదేశాల్లో జరుగనుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా ఓ ప్రముఖ టెక్నీషియన్‌ పనిచేయనున్నాడు. ప్రస్తుతం ప్రీపోడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు. టెక్నికల్‌ అంశాలపై మంచి పట్టు ఉన్న సునీల్‌రెడ్డి ఈ చిత్రాన్ని ఉన్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించనున్నాడు. సాయిధరమ్‌తేజ్‌తో ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఇందుకోసం పక్కాగా స్క్రిప్ట్‌వర్క్‌ చేసి రంగంలోకి దిగుతాడట. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా కళ్యాణ్‌రామ్‌తో ‘ఓం’  తీసిన సునీల్‌రెడ్డితో పాటు, కళ్యాణ్‌రామ్‌తో ‘పటాస్‌’ తీసిన అనిల్‌రావిపూడి కూడా సాయితో ఓ సినిమా చేయనున్నాడు. ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’ రిలీజ్‌ అయిన తర్వాత ఈ రెండు చిత్రాలను ఒకేసారి పట్టాలెక్కించాలని సాయి ప్లాన్‌ చేసుకుంటున్నాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ