Advertisementt

పుకార్లపై ర‌కుల్ ప్రీత్ రియాక్షన్!

Fri 17th Jul 2015 06:35 AM
rakul preet singh,senior heroines,trisha,tamanna  పుకార్లపై ర‌కుల్ ప్రీత్ రియాక్షన్!
పుకార్లపై ర‌కుల్ ప్రీత్ రియాక్షన్!
Advertisement
Ads by CJ

వ‌రుస‌గా స్టార్ హీరోల సినిమాల్లో  అవ‌కాశాలు అందుకొంటూ దుమ్ము దులుపుతోంది ర‌కుల్ ప్రీత్‌సింగ్‌. ఇప్పుడు టాలీవుడ్‌లో నెంబ‌ర్  హీరోయిన్ ఎవ‌రంటే ర‌కుల్ పేరే చెబుతున్నారు. ప్ర‌స్తుతం లండ‌న్‌లో ఎన్టీఆర్ సినిమా షూటింగ్‌లో ఉంది. అక్క‌డి నుంచే ర‌కుల్ ఓ విష‌యంపై ట్విట్ట‌ర్ ద్వారా స్పందించింది. సీనియ‌ర్ హీరోయిన్లు త్రిష‌, త‌మ‌న్నాల‌పై ర‌కుల్ కామెంట్లు చేసింద‌నీ, వాళ్ల‌లా నేను పరాజ‌యాల‌కి వెనుదిరిగే ర‌కాన్ని కాద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చిందని నాలుగైదు రోజులుగా మీడియాలో వార్త‌లొస్తున్నాయి. ఆ వార్త‌లు లండ‌న్‌లో ఉన్న ర‌కుల్ చెవిన ప‌డ్డాయి. దీంతో  ఆమె వెంట‌నే స్పందించింది. 'నేను దేశంలో కూడా లేను. అయినా నాపై లేని పోని పుకార్లు పుట్టిస్తారా? ద‌య‌చేసి మీడియా ఇలాంటి వార్త‌ల్ని ప్ర‌చారం చేయొద్దు' అంటూ ట్విట్ట‌ర్ ద్వారా వేడుకొంది. సీనియ‌ర్ క‌థానాయిక‌లంటే త‌న‌కెంతో గౌర‌వం అని చెప్పుకొచ్చింది. వాళ్ల‌ని చూసే  నేను న‌ట‌న‌ని నేర్చుకొన్నాన‌ని, ఇప్పుడు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఈ స్థాయిలో ఉన్నానంటే కార‌ణం వాళ్లే అని ర‌కుల్ పేర్కొంది. అలాంటి వాళ్ల‌తో న‌న్ను నేను కంపేర్ చేసుకోవ‌డానికే ఇష్ట‌ప‌డ‌న‌నీ, ఇక వాళ్ల‌పై కామెంట్లు ఎందుకు చేస్తాన‌ని ఆమె వ్యాఖ్యానించింది. ఇండియా వ‌చ్చాక ఈ విష‌యం గురించి ఆమె మీడియాతో మాట్లాడే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలిసింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ