Advertisementt

‘బాహుబలి’లో ఆ సీన్‌ చాలామందిని బాధపెట్టింది!

Fri 17th Jul 2015 10:56 AM
sneha ullal,twitter,bahubali,rajamouli,ballala deva  ‘బాహుబలి’లో ఆ సీన్‌ చాలామందిని బాధపెట్టింది!
‘బాహుబలి’లో ఆ సీన్‌ చాలామందిని బాధపెట్టింది!
Advertisement
Ads by CJ

సినీ ప్రపంచం అంతా ‘బాహుబలి’ని మెచ్చుకుంటూ ట్వీట్స్‌ చేస్తుంటే హీరోయిన్‌ స్నేహ ఉల్లాల్‌ మాత్రం సినిమాలో ఓ తప్పు పట్టుకుంది. తనకేం నచ్చలేదో అది ట్విట్టర్‌ సాక్షిగా చెప్పేసింది. ఆమె కూడా ఈ చిత్రంపై ఉన్న అభిమానంతో మొదటి రోజు మొదటి షో చూసేసింది.  సినిమాలో ఫలానాది తప్పు అని నిలదీసింది. ఆమె ట్వీట్‌ చేస్తూ... ‘బాహుబలి’ విషయంలో నాకు ఓ విషయం అస్సలు నచ్చలేదు. యుద్దానికి వెళ్లే ముందు దేవతని ప్రసన్నం చేసుకోవడానికి ఓ మూగజీవిని బలి తీసుకోవడం చూపించారు. నాకు అసలు నచ్చలేదు. మన కల్చర్ లో అలాంటిది ఉన్నా కూడా దాన్ని తెరపై పబ్లిగ్గా చూపించడం బాగోలేదు. భళ్లాల దేవుడు ఆ దున్నపోతును నరికేయడం అస్సలు నచ్చలేదు.. అని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో స్నేహ ఉల్లాల్‌కు ఉన్న అభిప్రాయమే చాలా మందికి ఉంది. కానీ ఎవ్వరూ బయటపడలేదు. స్నేహ మాత్రం బయటపడి ఓపెన్‌గా చెప్పేసింది..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ