Advertisementt

మొత్తానికి ‘కిక్‌2’ విషయంలో క్లారిటీ!

Sat 18th Jul 2015 01:06 PM
raviteja,kick2,sreemanthudu,kalyan ram,ntr arts  మొత్తానికి ‘కిక్‌2’ విషయంలో క్లారిటీ!
మొత్తానికి ‘కిక్‌2’ విషయంలో క్లారిటీ!
Advertisement
Ads by CJ

ఏ సినిమా అయినా ఎక్కువసార్లు వాయిదాపడుతుంటే దానికుండే క్రేజ్‌ తగ్గిపోతుంది. ఇలా వాయిదా మీద వాయిదాలు పడిన సినిమాలు పెద్దగా కిక్కు అందించిన సందర్భాలు బహు అరుదు. కాగా నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మాతగా, నందమూరి తారకరామారావు ఆర్ట్స్‌ పతాకంపై రవితేజ, రకుల్‌ప్రీత్‌సింగ్‌ జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కిక్‌2’. వాస్తవానికి సూపర్‌హిట్‌ అయిన ‘కిక్‌’కు స్వీక్వెల్‌ కావడంతో ఈ చిత్రానికి మొదట్లో భారీ క్రేజ్‌ వచ్చింది. అయితే సినిమా వాయిదాలు పడుతుండటంతో క్రేజ్‌ తగ్గిపోతోంది. ఈ చిత్రాన్ని నిర్మాత కళ్యాణ్‌రామ్‌ తన తాతగారైన సీనియర్‌ ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా మే 28న విడుదల చేస్తామని ప్రకటించాడు. కానీ అది వాయిదా పడింది. ఆ తర్వాత కూడా మరో రెండు డేట్లు చెప్పి మరీ వాయిదా వేశారు. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ఆగష్టు 14న స్వాతంత్య్రదినోత్సవ కానుకగా విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆగష్టు 7న మహేష్‌బాబు ‘శ్రీమంతుడు’ విడుదల కానుండటంతో ఆ చిత్రం వచ్చిన వారం తర్వాత ‘కిక్‌2’ని విడుదల చేయనున్నారు. మరి ‘శ్రీమంతుడు’ పెద్ద హిట్‌ అయితే మాత్రం ‘కిక్‌2’ మీద దాని ప్రభావం చాలా ఉంటుంది అని చెప్పవచ్చు. కాగా ‘కిక్‌2’లో రవితేజ, ఇలియానాకు పుట్టిన కొడుకు కథతో ఈ చిత్రం సాగనుంది. ఈ చిత్రం ప్రేక్షకులకు డబుల్‌ కిక్‌ ఇస్తుందని యూనిట్‌ నమ్మకంగా ఉండటం విశేషం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ