తమిళ హీరో శింబు నటించిన ‘వాలు’ చిత్రం వివిధ సమస్యలతో విడుదల కావడంలేదు. తమిళ సినీ పరిశ్రమలో శింబు సినిమా విడుదల కాకుండా కుట్ర జరుగుతోందని శింబుతో పాటు ఆయన తండ్రి రాజేంద్రన్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ఆలస్యం కావడాన్ని తట్టుకోలేని ఓ శింబు అభిమాని ఒకరు ఆత్యహత్యా ప్రయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై శింబు స్పందిస్తూ... ఈ సంఘటన నన్ను ఎంతో భాదించింది. దయచేసి ఎవరు ఇలాంటి పనులు చేయవద్దు. అభిమానులు శాంతంగా ఉండాలని పిలుపునిచ్చారు. సినిమా విడుదల ఆలస్యం కావడంతో తాను కూడా నిరాశలోనే ఉన్నానని, అయితే అభిమానుల అండతోనే ధైర్యంగా ఉన్నట్లు శింబు తెలిపాడు. కాగా ఈచిత్రంలో శింబుకు జోడీగా ఆయన మాజీ ప్రియురాలు హన్సిక నటిస్తుండగా, మరో కీలకపాత్రలో సంతానం నటిస్తున్నాడు.