‘బాహుబలి’ మొదటి పార్ట్ సూపర్ కలెక్షన్లు సాధిస్తూ రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రాన్ని అధికధరలకు కొన్న పంపిణీదారులకు కూడా ఈ చిత్రం మంచి ఆదాయాన్నే అందిస్తోంది. దీంతో ‘బాహుబలి2’ బిజినెస్ ఇంకా లాభదాయకంగా ఎలా చేయాలా? అనే ఆలోచనలో రాజమౌళి ఉన్నాడు. ఆల్‌రెడీ ‘బాహుబలి1’ని కొన్న బయ్యర్లకే మరింత మంచి రేటుకు అమ్మాలా? లేక ఈరోస్ వంటి కార్పొరేట్ సంస్థకు పంపిణీహక్కులు ఇచ్చేసి హ్యాపీగా షూటింగ్‌పైనే పూర్తి ఏకాగ్రత పెట్టాలా? అనే విషయంలో రాజమౌళి సందిగ్దంలో ఉన్నాడట. మొదటి పార్ట్‌ను కొన్న బయ్యర్ల నుండి ముందే డబ్బు వసూలు చేసి ఆ డబ్బులే పెట్టుబడిగా సెకండ్ పార్ట్‌లోని మిగిలిన 40శాతం షూటింగ్ చేయాలని కూడా రాజమౌళి ఆలోచిస్తున్నాడు. ఇక కార్పొరేట్ సంస్థలకు రైట్స్ ఇచ్చినా కూడా వారి నుండి ముందే అడ్వాన్స్ తీసుకొని ముందుకు సాగాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నాడు. మొత్తానికి నిర్మాత డబ్బుతో కాకుండా బయటి నుండి వచ్చే బిజినెస్ ఆఫర్ల నుండే పెట్టుబడిని పెట్టాలనే విషయంలో మాత్రం రాజమౌళి తన రాజనీతిని ఉపయోగిస్తున్నాడు. ఈ విషయంలో రాజమౌళి బుర్రకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!