Advertisementt

రామ్‌ ఆశలు నెరవేరతాయా!

Wed 22nd Jul 2015 01:04 PM
ram,pandaga chesko,sivam movie,raviteja,kick2  రామ్‌ ఆశలు నెరవేరతాయా!
రామ్‌ ఆశలు నెరవేరతాయా!
Advertisement
Ads by CJ

వరుస పరాజయాల్లో ఉన్న హీరో రామ్‌కు ఇటీవల వచ్చిన ‘పండగచేస్కో’ చిత్రం కాస్త ఊరటనిచ్చింది. కానీ ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెటుకున్న రామ్‌ ఆశించిన  సూపర్‌హిట్‌ కోరికను  మాత్రం ఆ సినిమా తీర్చలేకపోయింది. ప్రస్తుతం రామ్‌ స్టార్‌డైరెక్టర్ సురేందర్‌రెడ్డి దగ్గర శిష్యరికం చేసిన శ్రీనివాసరెడ్డి అనే నూతన దర్శకుడితో ‘శివమ్‌’ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని రామ్‌ పెద్దనాన్న స్రవంతి రవికిషోర్‌ నిర్మిస్తున్నాడు. ఇందులో రామ్‌ సరసన రాశిఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ జంట తెరపై చూడటానికి ఎంతో చూడముచ్చటగా ఉంటుందని యూనిట్‌ సభ్యులు అంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌ పూర్తయితే సినిమా టాకీపార్ట్‌ మొత్తం పూర్తవుతుంది. బాలెన్స్‌ ఉంటే పాటలను వచ్చే నెలలో పూర్తి చేసి సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్‌ 17న విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే వినాయక చవితి కానుకగా రవితేజ ‘బెంగాల్‌టైగర్‌’ రిలీజ్‌ అవుతుందని అంటున్నారు. అయితే ఇప్పటికీ రవితేజ నటించిన ‘కిక్‌2’ విడుదల కాకపోవడంతో ‘బెంగాల్‌టైగర్‌’ రిలీజ్‌కు ఇప్పుడే తొందరపడడని అంటున్నారు. అదే జరిగితే అది రామ్‌ ‘శివమ్‌’కు అదృష్టమే అని చెప్పవచ్చు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ