యంగ్ టైగర్ ఎన్టీఆర్, సుకుమార్ ల ఫస్ట్ కాంబినేషన్‌లో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న భారీ చిత్రం షూటింగ్ లండన్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. యంగ్‌టైగర్ ఎన్టీఆర్ తనయుడు అభయ్‌రామ్ పుట్టినరోజు జూలై 22. అభయ్‌రామ్ పుట్టినరోజు వేడుకలను ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ స్పాట్‌లోనే జరుపుకున్నారు. తనయుడి పుట్టినరోజు కోసం షూటింగ్ స్పాట్ నుంచి రావడం కుదరకపోవడం వల్ల తన ఫ్యామిలీని లండన్‌కు రప్పించి అక్కడే పుట్టినరోజు వేడుకను జరిపారు. అభయ్‌రామ్ తన మొదటి పుట్టినరోజును లండన్‌లో జరుగుతున్న ఎన్టీఆర్, సుకుమార్ ల చిత్రం షూటింగ్ స్పాట్‌లో జరుపుకోవడం విశేషం. అభయ్‌రామ్ మొదటి పుట్టినరోజును జరుపుకోవడంతో ఎన్టీఆర్ అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన భారీ షెడ్యూల్ సెప్టెంబర్ 20 వరకు యూరప్‌లో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఆగస్ట్ నెలాఖరు వరకు లండన్‌లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. యంగ్‌టైగర్ ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌తోపాటు మరికొంత మంది భారీ తారాగణం నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: విజయ్ కె.చక్రవర్తి, ఫైట్స్: పీటర్ హెయిన్స్, సమర్పణ: రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, కో-ప్రొడ్యూసర్: భోగవల్లి బాపినీడు, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సుకుమార్.