Advertisementt

‘బాషా’ సీక్వెల్‌పై సురేష్‌కృష్ణ!

Fri 24th Jul 2015 10:44 AM
suresh krishna,rajinikanth,ajith,basha movie sequel  ‘బాషా’ సీక్వెల్‌పై సురేష్‌కృష్ణ!
‘బాషా’ సీక్వెల్‌పై సురేష్‌కృష్ణ!
Advertisement
Ads by CJ

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కెరీర్‌నే మలుపుతిప్పిన చిత్రం ‘బాషా’. ఈ చిత్రంలోని ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ ఇప్పటికీ ఎందరో నిర్మాతలకు స్పూర్తినిస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని పంచ్‌ డైలాగులకు విజిల్‌ వేయని ప్రేక్షకుడు ఉండడు. ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే... వంటి డైలాగు దీనికి ఉదాహరణ. 1995లో వచ్చిన ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో తన పేరును లిఖించుకొని చిరస్థాయిగా అందరి మదిలో నిలిచిపోయింది. ఈ చిత్రం సీక్వెల్‌ను మరలా దర్శకుడు సురేష్‌కృష్ణ రజనీకాంత్‌తో ప్లాన్‌ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా రజనీ ఈ సినిమాను ఒప్పుకోలేదని అందుకే మరో తమిళ స్టార్‌ ‘తల’ అజిత్‌తో ఈ సినిమాను దర్శకుడు సురేష్‌కృష్ణ ప్లాన్‌ చేస్తున్నాడంటూ వార్తలు మీడియాలో వస్తున్నాయి. మీడియాలో వస్తున్న కథనాలను సురేష్‌కృష్ణ కొట్టిపారేశాడు. అయినా అజిత్‌తో కలిసి పనిచేయాలని మాత్రం ఉందని, అది అజిత్‌ నిర్ణయంపై ఆధారపడి ఉందని, అంతేగానీ ‘బాషా’ సీక్వెల్‌పై వస్తున్న వార్తలు మాత్రం నిజం కాదని సురేష్‌కృష్ణ స్పష్టం చేశాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ