Advertisementt

చిరు 150 వర్సెస్ విజయశాంతి రీఎంట్రీ!

Sat 25th Jul 2015 08:34 AM
chiranjeevi,vijayashanthi,chiranjeevi 150th movie  చిరు 150 వర్సెస్ విజయశాంతి రీఎంట్రీ!
చిరు 150 వర్సెస్ విజయశాంతి రీఎంట్రీ!
Advertisement
Ads by CJ

తెలంగాణ ఉద్యమం, తర్వాత ఎన్నికలు, ఇంతలో అనారోగ్యం.. వీటన్నింటి మధ్య గత కొంతకాలంగా ఎవ్వరికీ పెద్దగా కనిపించని లేడీ అమితాబ్‌ విజయశాంతి త్వరలో తానే ముఖ్యపాత్రలో ఓ దేశభక్తి చిత్రానికి శ్రీకారం చుట్టడానికి రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని ఆమే స్వయంగా నిర్మించనున్నట్లు కూడా తెలుస్తోంది. ఆమె మాట్లాడుతూ... ఇటీవల కొన్ని కారణాల వల్ల అందరికీ అందుబాటులో లేకుండాపోయాను. త్వరలో మరలా నటిగా రీఎంట్రీ ఇస్తాను.. అని తెలిపింది. మరి మీ సినిమా రిలీజ్‌ ఎప్పుడుంటుంది? అని ప్రశ్నిస్తే... చిరంజీవి 150వ చిత్రం ఎప్పుడు విడుదలకు సిద్దమవుతుందో అప్పుడే నా చిత్రాన్ని కూడా విడుదలకు సిద్దం చేస్తాను..అంటూ  ప్రకటించింది. మరి ఆమె సినిమాకు, చిరు 150వ సినిమాకు ఉన్న లింక్‌ ఏమిటో  అర్ధం కాక మెగాభిమానులు తలలు పట్టుకొంటున్నారు. మరి ఆమె చిరు సినిమాకు పోటీగా తన చిత్రాన్ని విడుదల చేస్తున్నానని చెప్పడమే ఆమె ఉద్దేశ్యమా? అనే ప్రశ్న తలెత్తుతోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ