Advertisementt

'సర్దార్‌' టైటిల్‌ పెట్టడానికి కారణం ఏమిటి?

Sat 25th Jul 2015 11:32 AM
pawan kalyan,sardar,gabbar singh 2,bobby  'సర్దార్‌' టైటిల్‌ పెట్టడానికి కారణం ఏమిటి?
'సర్దార్‌' టైటిల్‌ పెట్టడానికి కారణం ఏమిటి?
Advertisement
Ads by CJ

పవన్‌కళ్యాణ్‌ సినిమా అంటే అది టైటిల్‌ నుండి శుభం దాకా అంతా కోలాహలం... ఉత్కంఠ.. కాగా పవన్‌ నటిస్తున్న తాజా చిత్రానికి నిన్నటివరకు 'గబ్బర్‌సింగ్‌2' అనే పిలిచారు. వాస్తవానికి 'గబ్బర్‌సింగ్‌' సూపర్‌హిట్టయిన నేపథ్యంలో ఈ చిత్రానికి 'గబ్బర్‌సింగ్‌ 2'అని పెడితేనే ఎక్కడలేని హైప్‌ వస్తుంది. సినిమా హాట్‌కేకుల్లా అమ్ముడుపోతుంది. ఈ విషయాన్ని చాలా మంది పవన్‌కు చెప్పినప్పటికీ పవన్‌ ఈ సినిమా టైటిల్‌ను మార్చి, 'సర్దార్‌' అనే టైటిల్‌నే పెట్టాలని నిర్ణయించుకున్నాడట. 'గబ్బర్‌సింగ్‌2' అంటే వచ్చే క్రేజ్‌ 'సర్ధార్‌'కు రాదని తెలిసినప్పటికీ పవన్‌ ఆ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏమిటి? అనేది ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశం అయింది. దానికి కారణం 'గబ్బర్‌సింగ్‌2'అనే టైటిల్‌తో ఉన్న తలనొప్పులే దానికి కారణం అని సమాచారం. గతంలో 'గబ్బర్‌సింగ్‌'చిత్రం చేసేటప్పుడు ఆ టైటిల్‌ను రిజిష్టర్‌ చేసిన ముంబై వాళ్లు కోర్టుకి వెళ్లిన విషయం తెలిసిందే. అప్పుడు ఆ మేటర్‌ను డబ్బులు చెల్లించి సెటిల్‌ చేసుకున్నారు. మరలా ఈ చిత్రానికి 'గబ్బర్‌సింగ్‌2'అని పెడితే వచ్చే తలనొప్పులను ముందుగా ఊహించిన పవన్‌ ఆదిలోనే కరెక్ట్‌ నిర్ణయం తీసుకున్నాడని టాక్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ