రాజమౌళికి హీరోయిన్ పాత్రలను మలచడం రాదా? హీరోలపై పెట్టే శ్రద్ద హీరోయిన్లపై పెట్టడా? ఈ విమర్శలు ఏ సినీసమీక్షకుడు చేసినవో కాదు. కథానాయిక తాప్సివి. ఆశ్చర్యంగా ఉందా? .. నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. 'బాహుబలి'పై పెదవి విప్పిన తాప్సి ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలను వెండితెరపై చూపించిన విధానం ఏమాత్రం బాగోలేదని బహిరంగంగానే తన ఆవేశం వెల్లగక్కింది. సినిమా బాగున్నప్పటికీ హీరోయిన్ పాత్రలకు రాజమౌళి న్యాయం చేయలేకపోయాడని, ముఖ్యంగా తమన్నా పాత్రని ఆవిష్కరించిన విధానం ఏమాత్రం బాగోలేదని ఆమె బహిరంగంగానే రాజమౌళిపై మండిపడింది. హీరోలను బాగా చూపించడం కాదని, హీరోయిన్లకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఓ సలహా కూడా పడేసింది. మరి దీనికి రాజమౌళి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి....!