Advertisementt

రానా తదుపరి చిత్రానికి అంతా రెడీ!

Fri 31st Jul 2015 05:29 AM
daggubati rana,bahubali,bahubali 2,sekhar kammula,leader 2  రానా తదుపరి చిత్రానికి అంతా రెడీ!
రానా తదుపరి చిత్రానికి అంతా రెడీ!
Advertisement
Ads by CJ

ఏదిఏమైనా 'బాహుబలి-ది బిగినింగ్‌'తో దగ్గుబాటి రానా ప్రపంచ మార్కెట్‌లో తానేంటో నిరూపించుకున్నాడు. సరైన డైరెక్టర్‌, సబ్జెక్ట్‌ పడాలనే కానీ నటనలో తానేమీ వీక్‌ కాదని తొడగొట్టి ప్రూవ్‌ చేశాడు. వాస్తవానికి 'బాహుబలి' పార్ట్‌1లో రానా హీరో ప్రభాస్‌ను పక్కకునెట్టి ప్రబాస్‌ను డామినేట్‌ చేశాడనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఇక ఈ చిత్రం సెకండ్‌ పార్ట్‌లో రానా నటన ఇంకా పీక్‌ స్టేజీకి వెళ్లుతుందని చిత్ర యూనిట్‌ అంటోంది. త్వరలో ప్రారంభం అయ్యే 'బాహుబలి' పార్ట్‌2 షూటింగ్‌లో జాయిన్‌ కావడానికి రానా ఎదురుచూపులు చూస్తున్నాడు. 'బాహుబలి' పార్ట్‌2 చిత్రం విడుదలైన తర్వాత ప్రభాస్‌ తెలుగులో ఎలాంటి సినిమా చేయనున్నాడు అనేది ఇప్పుడు అందరికీ ఉత్కంఠను కలిగిస్తోంది. 'బాహుబలి' పూర్తయిన తర్వాత రానా తన మొదటి చిత్రం 'లీడర్‌'కు స్వీక్వెల్‌ చేయడానికి రెడీ అవుతున్నాడని పక్కా సమాచారం. ఈ విషయాన్ని ఇన్‌డైరెక్ట్‌గా రానా ట్వీట్‌ కూడా చేశాడు. 'లీడర్‌' సీక్వెల్‌కు శేఖర్‌ కమ్ములనే దర్శకత్వం వహించనున్నాడు. మరి రానా నిర్ణయం కరెక్టా? కాదా? అనే విషయంపై ఇప్పుడు అంతటా చర్చ నడుస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ