బాలకృష్ణ కెరీర్‌లో గొప్పగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో 'ఆదిత్య 369' ఒకటి. సైన్స్ ఫిక్షన్‌గా ఎప్పుడో వచ్చిన ఈ చిత్రాన్ని ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ చిత్రానికి లెజెండ్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని అటు బాలకృష్ణతో పాటు సింగీతం కూడా ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం సీక్వెల్‌కు స్టోరీ పాయింట్‌ను విన్న బాలయ్య దానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడని, ఈ చిత్రానికి 'ఆదిత్య 999' అనే టైటిల్ పెట్టనుననట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య తన 99వ చిత్రంగా శ్రీవాస్ దర్శకత్వంలో 'డిక్టేటర్' చేస్తున్నాడు. ఆ తర్వాత ఆయన తన కెరీర్‌లో కీలకమైన 100వ చిత్రం చేయనున్నాడు. మరి బాలయ్య 100వ చిత్రంగా బోయపాటి సినిమా చేస్తాడా? లేక సింగీతం సినిమా చేస్తాడా..? అనేది సస్పెన్స్‌గా ఉంది. తన 100వ చిత్రంగా బోయపాటి సినిమా చేస్తే సింగీతం సినిమా 101వ చిత్రం అవుతుంది. ఈ చిత్రం తర్వాత సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు!