Advertisementt

రీమేక్‌పై కన్నేసిన బన్నీ!

Wed 05th Aug 2015 04:43 AM
allu arjun,rangi tharanga,remake rights,thriller movie  రీమేక్‌పై కన్నేసిన బన్నీ!
రీమేక్‌పై కన్నేసిన బన్నీ!
Advertisement
Ads by CJ

తాజాగా స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ కన్నడంలో విజయవంతమైన 'రంగి తరంగ' చిత్రాన్ని చూశాడు. బెంగుళూరులోని ఓ థియేటర్‌లో ఆయన ఈ సినిమాని వీక్షించాడు. ఇక అల్లుఅర్జున్‌ ఇంత ఆసక్తిగా థియేటర్‌ వెళ్లి మరీ ఈ చిత్రం చూడటంతో ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయనున్నారని, అందులో బన్నీ హీరోగా నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఇదో థ్రిల్లర్‌ మూవీ. ఈ చిత్రం 'బాహుబలి' హవాను సైతం తట్టుకొని కర్ణాటకలో మంచి విజయం సాధించడంతో ఈ చిత్రంపై మన టాలీవుడ్‌ నిర్మాతల కన్ను పడింది. మరి ఈ చిత్రం రీమేక్‌రైట్స్‌ను ఏ నిర్మాత దక్కించుకుంటాడో వేచిచూడాల్సివుంది...! ఈ చిత్రం చూసిన వారు ఈ సినిమా బన్నీకి అయితే పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అవుతుందని అంటున్నారు...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ