టాలీవుడ్‌కు సంక్రాంతి, వేసవి సీజన్ల తర్వాత అతి పెద్ద సీజన్ దసరా సెలవులు. దీంతో త్వరలో రాబోయే దసరా సీజన్‌లో ఇద్దరు నట వారసులు పోటీపడనున్నారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం.... రామ్‌చరణ్ -శ్రీనువైట్ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల చేస్తామని ఆ చిత్ర యూనిట్ సినిమా ప్రారంభం రోజునే ప్రకటించింది. గత ఏడాది దసరాకు యావరేజ్‌గా నిలిచిన 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రాన్ని దసరా సీజన్‌తో ఎంతో కొంత బెనిఫిట్ పొందిన రామ్‌చరణ్ ఈ ఏడాది కూడా దసరాను టార్గెట్ చేస్తుండటం విశేషం. ఇక తాజా సమాచారం ప్రకారం అక్కినేని మూడోతరం వారసుడు, నాగార్జున చిన్న కుమారుడైన అక్కినేని అఖిల్ హీరోగా తెరంగేట్రం చేస్తోన్న తొలి సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి వినాయక్ దర్శకత్వం వహిస్తుందటంతో ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ వస్తోంది. ఈ చిత్రాన్ని కూడా దసరా సీజన్‌లో అంటే అక్టోబర్ 21 లేదా 22న విడుదల చేయడానకి ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ ఇద్దరు వారసుల సినిమాలు కేవలం వారం గ్యాప్‌లో రిలీజ్ అవుతుండటం ఆసక్తిని కలిగిస్తోంది. అయితే రామ్‌చరణ్ సినిమాకు పోటీగా కాకుండా మరో రెండు వారాలు గ్యాప్ తీసుకొని అఖిల్ సినిమా వచ్చే అవకాశాలను కూడా తోసిపుచ్చలేం. మరి ఈ ఇద్దరిలో దసరా మొనగాడు అనిపించుకునేది ఎవరో త్వరలో తేలనుంది.