Advertisementt

దేవిశ్రీకి ఎసరు!

Sat 08th Aug 2015 09:29 AM
devisriprasad,trivikram sreenivas,nithin,anirudh  దేవిశ్రీకి ఎసరు!
దేవిశ్రీకి ఎసరు!
Advertisement
Ads by CJ

కొత్త వారి ఎంట్రీతో పాతవారికి ప్రయారిటీ తగ్గడం మామూలే. పాత నీరు పోయి కొత్త నీరు రావడం ఎక్కడైనా సహజం. అయితే కొత్తవారి వల్ల అప్పటివరకు మకుటంలేని మహారాజులుగా వెలిగిన వారు తెరమరుగు కావడం, రేసులో వెనకపడటం మామూలే, దాన్ని పాతవారు సరిగ్గా జీర్ణించుకోలేరు. టాలీవుడ్‌లో స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ హోదాలో ఉన్న దేవిశ్రీప్రసాద్‌ ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. టాలీవుడ్‌లో మ్యూజిక్‌ జర్నీ స్టార్ట్‌ చేసి కోలీవుడ్‌ స్టార్‌ హీరోల సినిమాకు సంగీతం అందిస్తున్న దేవిశ్రీకి ఇప్పుడు కొలవెరి కుర్రాడి గుబులు పట్టుకొంది. దేవిశ్రీతో హాట్రిక్‌ హిట్స్‌ కొట్టి దేవిశ్రీతో ఎనలేని అనుబంధం కలిగిన డైరెక్టర్‌ త్రివిక్రమ్‌శ్రీనివాస్‌ 'సన్నాఫ్‌ సత్యమూర్తి' సినిమాకు దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్‌తో ఏమాత్రం తృప్తిపడలేదని, దాంతో నితిన్‌తో తాను చేయబోయే తాజా చిత్రానికి అనిరుధ్‌ను తీసుకున్నాడని టాక్‌. మరి ఈ సినిమాకు అనిరుధ్‌ సూపర్‌ మ్యూజిక్‌ అందించి సినిమా సక్సెస్‌ అయితే మాత్రం తెలుగునాట కూడా అనిరుధ్‌ హవా మొదలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ