Advertisementt

రాజమౌళి మల్టీస్టారర్‌ సినిమా చేయనున్నాడా?

Sat 08th Aug 2015 09:58 AM
rajamouli,bahubali2,eega2,allu arjun,ajith  రాజమౌళి మల్టీస్టారర్‌ సినిమా చేయనున్నాడా?
రాజమౌళి మల్టీస్టారర్‌ సినిమా చేయనున్నాడా?
Advertisement
Ads by CJ

'బాహుబలి'తో సంచలనాలు సృష్టిస్తోన్న దర్శకదీరుడు రాజమౌళి 'బాహుబలి2' తర్వాత ఏ సినిమా చేయనున్నాడు? అనే విషయంపై అంతటా చర్చ జరుగుతోంది. 'బాహుబలి' పార్ట్‌ 2 తర్వాత ఆయన 'ఈగ2' తీస్తాడని కొందరు, ఆ వెంటనే మహేష్‌ చిత్రం ప్రారంభిస్తాడని కొందరు అంటుంటే కొందరు బాలీవుడ్‌ సినిమాను తీస్తాడని చెబుతున్నారు. అయితే తాజాగా రాజమౌళి తీయబోయే సినిమా విషయంలో మరో ప్రాజెక్ట్‌ వచ్చి చేరిందని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు అంటున్నాయి. 'బాహుబలి 2' తర్వాత రాజమౌళి స్టైలిష్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌, తమిళ సూపర్‌స్టార్‌ అజిత్‌ల కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్‌ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తీయనున్నాడని అంటున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్‌వర్క్‌ను కూడా రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్‌ పూర్తి చేశాడని, త్వరలో బన్నీ, అజిత్‌లకు స్క్రిప్ట్‌ వినిపించనున్నారని అంటున్నారు. మరి వీటిల్లో ఏది నిజమో రాజమౌళి నోరు విప్పితే కానీ చెప్పలేం..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ