చాలారోజుల గ్యాప్ తర్వాత మరలా రెండు చిత్రాలతో హీరోగా టర్న్ అయిన కమెడియన్ సునీల్ బిజీ అయ్యాడు. వాసువర్మ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా రూపొందుతున్న 'కృష్ణాష్టమి' చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇక ఆయన హీరోగా 'ప్రేమకథాచిత్రమ్' నిర్మాత సుదర్శన్ రెడ్ది రామ్‌గోపాల్ వర్మ శిష్యుడు ఆకెళ్ల వంశీకృష్ణ దర్శకత్వంలో చేయనున్న చిత్రం ఈ నెల 18నుండి సెట్స్‌పైకి వెళ్లనుంది. కాగా ఈ చిత్రానికి 'భటుడు' అనే టైటిల్‌ను పెట్టారు. కానీ ఈ టైటిల్ విన్నవారు ఈ టైటిల్ బాగాలేదని, ముఖ్యంగా సునీల్‌కు ఇది యాప్ట్ కాదని అంటున్నారు. మరి అదే టైటిల్‌ను కన్‌ఫర్మ్ చేస్తారా? లేక టైటిల్ మారుస్తారా? అనే విషయం తెలియాల్సివుంది...!