లవర్‌బోయ్ ఇమేజ్ ఉన్న యంగ్ హీరో నాగశౌర్యకు 'జాదూగాడు' పెద్ద షాక్‌నే ఇచ్చింది. మాస్ ఇమేజ్ కావాలని కోరుకున్న ఆయన కలను కల్లలుగా చేయడమే కాదు.. స్వతహాగా తనకు ఉన్న లవర్‌బోయ్ ఇమేజ్ కూడా సందిగ్దంలో పడింది. ఇప్పటికీ 'జాదుగాడు' చిత్రం శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడుపోలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ ఎఫెక్ట్ ఆయన చేస్తున్న రెండు చిత్రాలపై పడనుంది. నందినిరెడ్డి, రమేష్‌వర్మల చిత్రాలపై కూడా ఈ ఎఫెక్ట్ పడటం ఖాయమని చెప్పవచ్చు. ఆయన సినిమాలకు శాటిలైట్ రాకపోవడంతో సినిమా విడుదలై మంచి విజయం సాధిస్తే గానీ శాటిలైట్ తిప్పలు తప్పవు. ఈ పరిణామం ఆయనతో సినిమాలు తీయాలనుకుంటున్న నిర్మాతల గుండెల్లో గుబురు పుట్టిస్తోంది. 'జాదూగాడు' ఫ్లాప్ అయిన తర్వాత కూడా ఆయన రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాకుండా తనకు ఇంత ఇస్తేనే సినిమా చేస్తానని నిబంధన పెడుతున్నాడట. అలా మొండికేయడం పక్కనపెడితే దర్శకుల విషయంలో కూడా ఆయన వేలుపెడుతూ, ఫలాన విధంగా ఫైట్ కావాలి.. ఫలానా విధంగా సాంగ్ కావాలనే రూల్స్ పెడుతుండే సరికి నిర్మాతలు ఈ యంగ్‌హీరో అంటేనే పారిపోతున్నారట. మరి అతని రాబోయే రెండు మూడు సినిమాలపైనే ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉందని, అవి కూడా నెగటివ్ ఫలితాన్ని ఇస్తే ఆయన కెరీర్‌కు శుభం కార్డు పడటం ఖాయమని ఫిల్మ్‌నగర్ వర్గాలు బహిరంగంగానే చెప్పుకొంటున్నాయి.