Advertisementt

క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా స్టార్‌ హీరోల హీరోయిన్‌.!

Wed 12th Aug 2015 06:10 AM
heroine bhumika,bhumika ready for second inninngs,bhumika 2nd innings,bhumika as character artist  క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా స్టార్‌ హీరోల హీరోయిన్‌.!
క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా స్టార్‌ హీరోల హీరోయిన్‌.!
Advertisement
Ads by CJ

ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్లుగా వెలుగొందిన నటీమణులు ఆ తర్వాత కొంత గ్యాప్‌ తీసుకొని క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తమ సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చెయ్యడమనేది సినిమా పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం. ఎంతో మంది హీరోయిన్లు తమ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా నటించి మెప్పించారు. ఆ కోవలోకి ఇప్పుడు మరో హీరోయిన్‌ భూమిక కూడా వచ్చి చేరుతోంది. తెలుగు, తమిళ్‌, మలయాళం, కన్నడ, హిందీ, భోజ్‌పురి, పంజాబీ భాషల్లో దాదాపు 40 సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన భూమిక ఇప్పుడు తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేస్తోంది. తెలుగులో టాప్‌ హీరోలు, చిన్న హీరోల సరసన నటించి హీరోయిన్‌గా ఓ స్పెషల్‌ ఇమేజ్‌ని తెచ్చుకున్న భూమిక ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా తన ప్రత్యేకతను చాటుకోవాలని ఉవ్విళ్ళూరుతోందట. పెళ్ళయిన తర్వాత అడపా దడపా కొన్ని సినిమాల్లో నటించినా ఫుల్‌ ప్లెడ్జ్‌డ్‌ క్యారెక్టర్‌గా సెటిల్‌ అవ్వలేదు. అందుకే ఇప్పుడు చాలా గ్యాప్‌ తర్వాత నటించాలని అనుకుంటున్నట్టు దర్శకనిర్మాతలకు సమాచారం అందించిందట భూమిక. మరి తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ని ఏ సినిమాతో స్టార్ట్‌ చేస్తుందో, ఇకపై ఎలాంటి క్యారెక్టర్స్‌ చేస్తుందో వెయిట్‌ అండ్‌ సీ. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ