Advertisementt

'బాహుబలి 2' కోసం కట్టప్ప త్యాగం..!

Wed 12th Aug 2015 10:31 AM
bahubali,kattappa,vijay 59th movie,kattappa in bahubali,satya raj  'బాహుబలి 2' కోసం కట్టప్ప త్యాగం..!
'బాహుబలి 2' కోసం కట్టప్ప త్యాగం..!
Advertisement
Ads by CJ

'బాహుబలి' చిత్రంలో కీలకమైన కట్టప్ప పాత్రను పోషించిన తమిళ నటుడు సత్యరాజ్‌. ఆయన కట్టప్ప పాత్రకు జీవం పోసి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. 'బాహుబలి2'లో కూడా కట్టప్ప పాత్ర కీలకం కానుంది. పార్ట్‌ 2కోసం ఆల్‌రెడీ సత్యరాజ్‌ 100రోజుల డేట్స్‌ కేటాయించాడు. కానీ అతనికి అనుకోకుండా తమిళస్టార్‌ విజయ్‌ నటిస్తున్న 59వ చిత్రంలో విలన్‌ క్యారెక్టర్‌ వచ్చింది. కానీ కట్టప్ప మాత్రం 'బాహుబలి'కి ఆటంకం కలుగుతుందని భావించి విజయ్‌ సినిమాను తిరస్కరించాడట. ఇలా నిజాయితీగా పనిచేసే ఆర్టిస్ట్‌లు ఈమధ్య తగ్గిపోయారని, అవకాశం వచ్చిన ప్రతి సినిమాను ఓకే చేసి ఆ తర్వాత నిర్మాతలను ఇబ్బందులుపెట్టే నేటితరం నటులలో ఈ అంకితభావం కొరవడిందని విశ్లేషకులు, విమర్శకులు సత్యరాజ్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ