మహేష్‌బాబు జీవితంలోకి నమ్రత అడుగుపెట్టిన క్షణం నుంచి ఆయన కెరీర్ మంచి ఊపందుకుంది. చక్కని ప్లానింగ్‌తో ఆయన కెరీర్‌ను అందంగా తీర్చిదిద్దింది నమ్రతా. నమత్రానే నా సక్సెస్ సీక్రెట్ అంటూ మహేష్ కూడా ఈ విషయాన్ని బహిరంగంగానే ఒప్పుకున్నాడు. కేవలం నటుడిగానే కాకుండా కార్పోరేట్ వాణిజ్య సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా మహేష్‌ను ఉన్నతస్థానంలో నిలిపింది కూడా ఆమె. అయితే వన్, ఆగడు వంటి ఫ్లాప్‌ల తర్వాత ప్రిన్స్ కెరీర్‌ను మరోసారి గాడిలో పెట్టాల్సిన బాధ్యత నమ్రతాపై పడింది. అందుకే శ్రీమంతుడు విషయంలో నిర్మాతగా కూడా మహేష్‌ను ఎంట్రీ చేసి ఆ సినిమా విషయంలో నమ్రతా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. ముఖ్యంగా ‘బాహుబలి’కి చిత్రానికి వచ్చిన పబ్లిసిటీ, హైప్‌ను చూసిన ఆమె శ్రీమంతుడుకు కూడా ఆ రేంజ్‌లోనే పబ్లిసిటి రావాలని అందుకు తగ్గ ప్రణాళికలు రెడీ చేసి అమలుపరిచింది. ఈ రోజు శ్రీమంతుడు వసూళ్లు ఇంత స్ట్రాంగ్‌గా వుండటానికి, మంచి ఓపెనింగ్స్ రావడానికి నమత్రానే పరోక్ష కారణమని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక నమ్రతా ప్లానింగ్ తెలిసినవాళ్లంతా శ్రీమంతుడు శ్రీమతి ప్లానింగా.. మజాకానా! అంటున్నారు.