మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ నటించిన రెండో చిత్రం 'కంచె'. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్బంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించనుండగా, ఆయన తండ్రి జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం రషెస్‌ను చూసిన మెగాఫ్యామిలీ ఈ చిత్రం అవుట్‌పుట్ పట్ల ఎంతో నమ్మకంతో ఉంది. కాగా ఆ ముందు రోజు అంటే అక్టోబర్ 1న మంచు విష్ణు హీరోగా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన 'డైనమైట్'ను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ చిత్రం తమిళ 'అరిమనంబి'కి రీమేక్‌గా రూపొందింది. దేవకట్టా దర్శకత్వ ప్రతిభ తెలిసిన వారు మాత్రం ఈ చిత్రం బాగుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఇద్దరు వారసుల సినిమాలలో ఎవరిది పైచేయి అవుతుందో వేచిచూడాల్సివుంది!