Advertisementt

ఈ బాబు మరలా మేకప్‌ వేస్తాడట!

Fri 14th Aug 2015 07:31 AM
tarun,single adi love story movie,director sunee  ఈ బాబు మరలా మేకప్‌ వేస్తాడట!
ఈ బాబు మరలా మేకప్‌ వేస్తాడట!
Advertisement
Ads by CJ

బాలనటునిగా నటించినప్పటికీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత లవర్‌బోయ్‌గా మారి మంచి విజయాలు సాధించి యువతను మరీ ముఖ్యంగా అమ్మాయిల మనసును దోచిన హీరో తరుణ్‌. అయితే ఈ బాబు తన స్వయంకృతాపరాదంతో తన స్థానాన్ని పోగొట్టుకున్నాడు. సినిమాల మీద కంటే ఇతర విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఆయన కెరీర్‌ పూర్తిగా నాశనమైపోయింది. ఆయన మేకప్‌ వేసి చాలాకాలం అయింది. హిట్లు కాదు కదా! చివరకు చాన్స్‌లే లేకుండా పోయాయి. ఆయన పరిస్థితి ఇంత డేంజర్‌జోన్‌లో పడటానికి ఆయన తల్లిదండ్రులు కూడా ఓ కారణం అనేది అందరికీ తెలిసిన విషయమే. కాగా తరుణ్‌ త్వరలో మరోసారి మేకప్‌ వేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. కన్నడంలో హిట్టయిన 'సింగిల్‌ ఆది లవ్‌స్టోరీ' సినిమాని తెలుగులో రీమేక్‌ చేస్తున్నారట. ఈ సినిమాలో తరుణ్‌ హీరోగా నటించబోతున్నట్లు సమాచారం. కన్నడలో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సునీ ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్‌ చేయనున్నాడు. ఈ సినిమా అయినా తరుణ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌కు శుభం పలికి, అతని కెరీర్‌ను గాడిలో పెడుతుందో లేదో చూడాలి...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ