Advertisementt

మహేష్‌ కంటే సమంతనే గ్రేట్‌ అంటున్నారు!

Fri 14th Aug 2015 01:19 PM
mahesh babu,samantha,attharintiki daredi,dookudu  మహేష్‌ కంటే సమంతనే గ్రేట్‌ అంటున్నారు!
మహేష్‌ కంటే సమంతనే గ్రేట్‌ అంటున్నారు!
Advertisement
Ads by CJ

మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'శ్రీమంతుడు' చిత్రం కలెక్షన్లు 50కోట్లు దాటాయి. ఈ విజయంతో 50కోట్లు దాటిన మహేష్‌ సినిమాల సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటివరకు టాలీవుడ్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక హీరో మహేష్‌ మాత్రమే. పవన్‌కళ్యాణ్‌, రామ్‌చరణ్‌, ప్రభాస్‌, అల్లుఅర్జున్‌లు వంటి స్టార్స్‌ ఇప్పటివరకు కేవలం రెండు చిత్రాల ద్వారా మాత్రమే ఈ ఘనత సాధించారు. దీంతో సోషల్‌ మీడియాలో మహేష్‌ ఫ్యాన్స్‌ హడావుడి ఎక్కువైంది. తమ హీరో సాధించిన ఘనత గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. దీంతో సమంత అభిమానులకు చిర్రెత్తింది. ఈ విషయంలో మహేష్‌ కంటే ముందు తమ అభిమాన హీరోయిన్‌ ఉందంటూ ప్రచారం మొదలుపెట్టారు. మహేష్‌ కెరీర్‌లో 50కోట్లు సాధించిన చిత్రాలు మూడు ఉంటే...సమంత కెరీర్‌లో నాలుగు ఉన్నాయని, 'అత్తారింటికి దారేది, దూకుడు, సన్నాఫ్‌ సత్యమూర్తి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఉన్నాయని వారు ఆధారాలతో చూపుతున్నారు. ఇక తమిళంలో ఆమె నటించిన 'కత్తి' చిత్రంకూడా 100కోట్ల క్లబ్‌కు చేరిందని, అయితే దానిని తాము పట్టించుకోమని,తెలుగులో మాత్రం ఆ ఘనత సమంతదే అని వాదిస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ