Advertisementt

బాలీవుడ్‌లో మరో బయోపిక్‌ మూవీ!

Fri 14th Aug 2015 03:33 PM
sania mirza,khel ratna award,farrakhan,parineeti chopra  బాలీవుడ్‌లో మరో బయోపిక్‌ మూవీ!
బాలీవుడ్‌లో మరో బయోపిక్‌ మూవీ!
Advertisement
Ads by CJ

ఇండియన్‌ టెన్నిస్‌స్టార్‌ సానియామీర్జా కెరీర్‌లో ఎన్నో విజయాలు సాధిస్తూ దేశానికి గర్వకారణంగా మారింది. ఇటీవలే కేంద్రప్రభుత్వం ఆమెకు ప్రఖ్యాత ఖేల్‌రత్న అవార్డు కూడా ప్రకటించింది. క్రికెట్‌ తప్ప టెన్నిస్‌ గురించి పెద్దగా పట్టించుకోని ఇండియాలో ఆమె విజయాల కారణంగా యువతను అటువైపు ఆకర్షించేలా చేసి టెన్నిస్‌కు మన దేశంలో పాపులారిటీ తెచ్చింది. సానియా తన కెరీర్‌లో ఎదిగిన తీరు, విజయాలు సాదించడానికి ఆమె పడిన కష్టం త్వరలో వెండితెరపై ఆవిష్కరింపబడుతోంది. సానియా జీవిత కథను సినిమాగా తీయడానికి బాలీవుడ్‌ దర్శకురాలు ఫరాఖాన్‌ ప్లాన్‌ చేస్తోంది. ఇటీవలే ఫరాఖాన్‌ ఈ విషయమై సానియాను కలిసి ఆమె నుండి అనుమతి తీసుకొంది. సానియా పాత్రలో బాలీవుడ్‌ బ్యూటీ పరిణితి చోప్రా నటించే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. సానియా గురించి ఇప్పటివరకు బయటి ప్రపంచానికి తెలియని ఆసక్తికర విషయాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారట

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ