Advertisementt

కమల్ హసన్ మాట అంటే మాటే!

Sun 16th Aug 2015 06:43 AM
kamalhassan,cheekatirajyam,trisha,jibran music  కమల్ హసన్ మాట అంటే మాటే!
కమల్ హసన్ మాట అంటే మాటే!
Advertisement
Ads by CJ

ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు ఒకెత్తు... 'చీకటిరాజ్యం' మరో ఎత్తు అంటున్నాడు లోకనాయకుడు కమల్‌హాసన్‌. ఈ సినిమా ఓ కొత్త పంథాలో సాగుతుందని, ఓ రాత్రి జరిగే కథ ఇదని.... నాలుగు విభిన్నమైన పాత్రల చూట్టూ కథ నడుస్తుందని కమల్‌ హామీ ఇస్తున్నాడు. కాగా ఈ చిత్రం షూటింగ్‌ 40రోజుల్లో పూర్తి అయింది. ఇక జిబ్రాన్‌ అందించిన సంగీతం సినిమాకు హైలైట్‌ అవుతుందని, త్రిష కూడా తన పాత్రకు సరైన న్యాయం చేసిందని, అలాగే కీలకమైన పాత్రను ప్రకాష్‌రాజు అద్భుతంగా పోషించాడని కమల్‌ అంటున్నాడు. ఈచిత్రాన్ని రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై కమల్‌ సోదరుడు ఎన్‌. చంద్రహాసన్‌ నిర్మిస్తున్నాడు. తనను చాలాకాలంగా అందరూ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారు? అని అడుగుతున్నారని, అందుకే ఈ చిత్రాన్ని ఏకకాలంలో తెలుగులో కూడా తెరకెక్కించి తన మాటను నిలబెట్టుకున్నానని, భవిష్యత్తులో తరచుగా తెలుగు సినిమాలు చేస్తానని కమల్‌ హామీ ఇస్తున్నాడు. త్వరలో పాటలను విడుదల చేయడానికి సన్నద్దం అవుతోన్న ఈ చిత్రాన్ని వీలున్నంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ