గతంలో ప్రభుదేవా, లారెన్స్, అమ్మ రాజశేఖర్ తరహాలో మరో కొరియోగ్రాఫర్ మెగాఫోన్ చేతబట్టి దర్శకునిగా మారడానికి రెడీ అయిపోయాడు. స్టార్‌హీరోల చేత కష్టమైనప్పటికీ అద్బుతమైన స్టెప్పులు వేయించే ప్రేమ్‌రక్షిత్ మొదట్లో నటుడవ్వాలని భావించినప్పటికీ చివరకు తెర వెనుకే ఉండి కెప్టెన్ సీట్‌లో కూర్చోనున్నాడు. ఇటీవలే ఆయన సురేష్‌ప్రొడక్షన్ అధినేత సురేష్‌బాబుకు, ఆయన తనయుడు రానాలకు ఓ స్టోరీ వినిపించాడట. స్టోరీ మొత్తం విన్న వారిద్దరికి అది బాగా నచ్చడంతో నువ్వే ఈ సినిమాని డైరెక్ట్ చేయవచ్చు కదా! అని అడిగారట. దానికి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేమ్‌రక్షిత్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఈ కాంబినేషన్ సెట్ అయింది. ప్రస్తుతం ప్రీపొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం సురేష్‌బాబుకి చెందిన సురేష్‌ప్రొడక్షన్ మీదనే నిర్మితం కానుంది. మరి సోలో హీరోగా ఈ చిత్రం రానాకు ఎంతవరకు సక్సెస్‌ను అందిస్తుందో చూడాల్సివుంది...!