టాలీవుడ్‌లో మహేష్‌బాబుది, కోలీవుడ్‌లో విజయ్‌ది ఒకే పరిస్థితి. వీరికి వారి వారి సొంతభాషల్లో వీరాభిమానులు ఉన్నారు. కానీ విజయ్‌కు తెలుగులో మార్కెట్ లేదు.. అలాగే మహేష్‌కు కూడా తమిళంలో మార్కెట్ లేదు. ఇప్పుడిప్పుడు ఈ ఇద్దరు హీరోలు పరాయి భాషలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. విజయ్ నటించిన 'తుపాకి ' పెద్దగా పబ్లిసిటీ లేకపోయినా తెలుగులో ఫర్లేదు అనిపించింది. ఇక ఎప్పుడో విడుదలైన 'జిల్లా' చిత్రం కూడా ఇటీవలే తెలుగులోకి అనువాదమై కొద్దిపాటి లాభాలను మూటగట్టుకుంది. ఆయన నటించిన 'కత్తి' రీమేక్ అవుతుందా? లేక డబ్బింగ్ అవుతుందా? అనేది ఇంకా తేలలేదు. తాజాగా విజయ్ నటించిన 'పులి' చిత్రం సెప్టెంబర్ 17న తమిళంతో పాటు తెలుగులోనూ ఒకే రోజున విడుదలకు సిద్దమవుతోంది. కాగా మహేష్‌బాబు నటించిన తాజా చిత్రం 'శ్రీమంతుడు' ఇక్కడ సూపర్‌హిట్‌గా నిలిచినప్పటికీ తమిళంలో కూడా ఒకే రోజు విడుదలైన తమిళ వెర్షన్ 'సెల్వందన్'కి కనీసపు ఓపెనింగ్స్ కూడా లేవట. మొదటవారంలో ఈ చిత్రం కనీసం కోటిరూపాయలు కూడా వసూలూ చేయలేదని నిర్మాత నవీన్ స్వయంగా తెలిపాడు. దీన్ని బట్టి చూస్తే మహేష్ కంటే విజయ్ బెటర్ అని ఒప్పుకోవాల్సిందే.