Advertisementt

పవన్‌కు చేదు వార్త... ఆయన ఫ్యాన్స్‌కు తీపి వార్త!

Wed 19th Aug 2015 04:18 AM
pawan kalyan,bobby,sardaar gabbarsingh,eros international  పవన్‌కు చేదు వార్త... ఆయన ఫ్యాన్స్‌కు తీపి వార్త!
పవన్‌కు చేదు వార్త... ఆయన ఫ్యాన్స్‌కు తీపి వార్త!
Advertisement
Ads by CJ

పవన్‌కళ్యాణ్‌ సినిమా అంటే ఎప్పుడు మొదలవుతుందో? లేదో? తెలియదు. ఎప్పుడు పూర్తవుతుందో అస్సలు తెలియదు. పవన్‌కు మూడ్‌ ఉంటే షూటింగ్‌కు వస్తాడు.. మూడ్‌ బాగోలేకపోతే షూటింగ్‌కు రాడు.. అనేది ఫిల్మ్‌నగర్‌ వార్త. ఇందులో వాస్తవం ఉందని కూడా అంగీకరించాలి. కానీ 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌' విషయంలో మాత్రం పవన్‌కు బంధనాలు పడ్డాయి. ఈ చిత్రాన్ని హోల్‌సేల్‌గా విడుదల చేయనున్న ఈరోస్‌ సంస్థ ఈచిత్రానికి నిర్మాత, పవన్‌ మిత్రుడైన శరత్‌మరార్‌తో ఓ ఒప్పందం చేసుకుందిట. ఇందులో సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్‌లోగా పూర్తిచేయాలనే షరత్తు విధించిందిట. దీంతో తనకు తెలియకుండానే శరత్‌మరార్‌ పవన్‌కు సంకెళ్లు వేసినట్లు భావిస్తున్నారు. ఇలా పవన్‌ను ఇరుకున పెట్టినప్పటికీ ఈరోస్‌ సంస్థ పెట్టిన షరత్తు మాత్రం పవన్‌ అభిమానులకు ఎంతో ఆనందం కలుగజేస్తోందని చెప్పాలి. తమ హీరో సినిమా ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా? అని ఎదురు చూసే పవర్‌స్టార్‌ అభిమానులకే కాదు... సినీ ప్రేమికులకు కూడా ఆనందాన్ని కలిగిస్తోంది. మరి ఈ షరత్తు పట్ల పవన్‌ స్పందన ఎలా ఉంటుందో వేచిచూడాల్సి ఉంది...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ