మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో 'కంచె' చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. ఈచిత్రాన్ని అక్టోబర్2న విడుదల చేయాలని భావిస్తున్నారు. కాగా హీరో చచ్చిపోవడం, ప్రేమ విఫలం కావడం.. తరహా ముగింపులు మన ప్రేక్షకులకు నచ్చవు. ఇలా యాంటీ క్లైమాక్స్ ఉండే పరభాషా చిత్రాలను రీమేక్ చేసేటప్పుడు కూడా ఇలాంటి క్లైమాక్స్‌లను మనవారు మార్చి రాసుకుంటారు. కథను సుఖాంతం చేస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా తమిళ 'రమణ'.. తెలుగు 'ఠాగూర్'లను చెప్పుకోవచ్చు. అయితే 'కంచె' చిత్రానికి మాత్రం క్రిష్ యాంటీ క్లైమాక్స్ రాసుకొన్నాడట. తాను అనుకున్నట్టే చిత్రీకరించాడట. అందుతున్న సమాచారం ప్రకారం క్రిష్ రాసిన స్టోరీ ప్రకారం సినిమా క్లైమాక్స్‌లో వరుణ్‌తేజ్ చనిపోతాడని, దేశం కోసం, ప్రేమ కోసం తన ప్రాణాలు అర్పిస్తాడని తెలుస్తోంది. మరి ఈ చిత్రాన్ని మన ప్రేక్షకులు ఎంత వరకు ఆదరిస్తారో వేచిచూడాల్సివుంది...!