Advertisementt

పవన్‌ చూపిన దారిలో మహేష్‌!

Thu 20th Aug 2015 07:37 AM
pawan kalyan,mahesh babu,attharintiki daredi,sreemanthudu  పవన్‌ చూపిన దారిలో మహేష్‌!
పవన్‌ చూపిన దారిలో మహేష్‌!
Advertisement
Ads by CJ

'అత్తారింటికి దారేది' విజయంలో పవన్‌కళ్యాణ్‌ అభిమానులకు పెద్ద పీట వేశాడు. ఈ చిత్రం విజయాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులకు స్పెషల్‌ థాంక్స్‌ చెప్పాడు. ఇందుకోసం 'ధ్యాంక్యూ మీట్‌'ను భారీగా ఏర్పాటు చేసి అభిమానులను నేరుగా కలిశాడు. ఇప్పుడు అదే దారిలో మహేష్‌ కూడా నడవనున్నాడు. ఆయన ఇటీవల నటించిన తాజా చిత్రం 'శ్రీమంతుడు' తెలుగులో పెద్ద హిట్‌ దిశగా నడుస్తోంది. దీంతో తన ఆనందాన్ని అభిమానులతో నేరుగా పంచుకొనేందుకు మహేష్‌ సైతం 'థాంక్యూ మీట్‌' ఏర్పాటు చేసి అభిమానులకు థాంక్స్‌ చెప్పనున్నాడు. ఈ కార్యక్రమం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అభిమానులను కలిపేందుకు మహేష్‌ నిర్ణయించుకున్నాడు. అయితే మహేష్‌ తన 'థాంక్యూమీట్‌'ను ఒక్కసారే కాకుండా మూడు సార్లు జరిపేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు. మొదటగా హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తదుపరి గుంటూరు, వైజాగ్‌లలో ఇదే తరహా థాంక్యూ మీట్స్‌ను ఏర్పాటు చేయాలని మహేష్‌ భావిస్తున్నాడట. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం త్వరలోనే అఫీషియల్‌గా ప్రకటించనున్నాడని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ