ఎన్టీఆర్ హీరోగా సురేష్‌వర్మ దర్శకత్వంలో 'సుబ్బు' చిత్రాన్ని నిర్మించిన ఆర్.శ్రీనివాస్ ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత తెలుగు సినిమా చెయ్యబోతున్నాడు. అయితే ఈసారి నాని హీరోగా సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. 'సుబ్బు' తర్వాత సినిమాల తెలుగు సినిమా నిర్మించని శ్రీనివాస్ డిస్ట్రిబ్యూటర్‌గా చాలా సినిమాలు రిలీజ్ చేశాడు. అలాగే కన్నడలో కూడా కొన్ని సినిమాలు నిర్మించాడు. ఈమధ్య విడుదలైన 'ఉపేంద్ర2' చిత్రాన్ని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసింది కూడా అతనే. ఈ సినిమా అతనికి లాభాలు తెచ్చిపెట్టలేకపోయింది.
చాలా గ్యాప్ తర్వాత ఆర్.ఎస్. ప్రొడక్షన్స్ బేనర్‌లో ఓ భారీ చిత్రాన్ని తెలుగులో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు శ్రీనివాస్. నాని హీరోగా, తాప్సీ హీరోయిన్ నటించే ఈ చిత్రానికి ఇంకా దర్శకుడు ఎవరన్నది ఫైనల్ అవ్వలేదు. హీరో, హీరోయిన్ ఫైనల్ అయినప్పటికీ డైరెక్టర్ ఇప్పటివరకు కన్‌ఫర్మ్ అవ్వకపోవడం అందర్నీ ఆశ్యర్యానికి గురి చేస్తోంది. ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టుగా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్‌తో రూపొందనున్న ఈ చిత్రాన్ని చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకొని భారీ ఎత్తున నిర్మించబోతున్నాడు శ్రీనివాస్. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అఫీషియల్‌గా ఎనౌన్స్ చేస్తారట.