చిన్న చిత్రాల దర్శకునిగా తనదంటూ ఓ బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న యువతరం దర్శకుడు మారుతి. దర్శకునిగానే కాకుండా నిర్మాతగా, సమర్పకునిగా కూడా ఈయన సొంతబేనర్‌లో సినిమాలు నిర్మిస్తున్నాడు. కాగా గతంలో ఆయన సీనియర్ స్టార్ హీరో వెంకటేష్, నయనతార జంటగా 'రాధ' అనే చిత్రం మొదలుపెట్టాడు. కానీ కాపీ మరకలు పడిన ఆ చిత్రాన్ని వెంకీ దూరంగా పెట్టారు. కాగా ఇప్పుడు మారుతి మరో స్టోరీలైన్‌తో వెంకీను ఆకట్టుకొని చాన్స్ కొట్టేశాడని సమాచారం. ప్రస్తుతం మారుతి వెంకీకి వినిపించిన స్టోరీలైన్‌ను డెవలప్ చేస్తున్నాడట. కాగా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముగ్గురు నిర్మాతలు పోటీ పడుతున్నారు. సురేష్‌బాబుతో పాటు హారిక అండ్ హాసిని రాధాకృష్ణ, అల్లుఅరవింద్‌లతో పాటు డి.వి.వి.దానయ్య కూడా ఈ పోటీలో ముందున్నాడు. దీంతో ఒకరు సమర్పకునిగా, మరో ముగ్గురు నిర్మాతలుగా ఈ చిత్రం రూపొందే అవకాశం ఉంది.