Advertisementt

కొరటాల వెనక ముగ్గురు నిర్మాతలు!

Thu 27th Aug 2015 04:12 AM
koratala siva,mirchi,srimanthudu,mythri movies,bandla ganesh,dvv danayya  కొరటాల వెనక ముగ్గురు నిర్మాతలు!
కొరటాల వెనక ముగ్గురు నిర్మాతలు!
Advertisement
Ads by CJ

'మిర్చి, శ్రీమంతుడు' చిత్రాలతో వరుసగా రెండు సూపర్‌హిట్స్‌ను కొట్టిన దర్శక రచయిత కొరటాల శివపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఆయనకు ఏకంగా ముగ్గురు నిర్మాతలు అడ్వాన్స్‌లు ఇవ్వడంతో ఆయన తదుపరి చిత్రం ఏమిటనే విషయంలో ఆసక్తి నెలకొని ఉంది. 'మిర్చి' సినిమా విడుదలకు ముందే ఈయనకు బండ్లగణేష్‌ అడ్వాన్స్‌ ఇచ్చి ఉన్నాడు. 'మిర్చి' విడుదలై సూపర్‌హిట్‌ అయిన తర్వాత డి.వి.వి.దానయ్య కొరటాలను పిలిచి అడ్వాన్స్‌ ఇచ్చాడు. ఇక 'శ్రీమంతుడు' షూటింగ్‌ సమయంలోనే ఈ చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీస్‌ అధినేతలు ఆయనకు మరో సినిమాకు అడ్వాన్స్‌ ఇచ్చారు. మరి ముందుగా కొరటాల శివ ఎవరికి సినిమా చేయనున్నాడు? ఎవరితో కలిసి హాట్రిక్‌కు సిద్దమవుతున్నాడు? అనేది ఇప్పుడు అందరికీ ఆసక్తిని కలిగిస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ