మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ చిత్రం 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రంలో యువహీరో వరుణ్‌సందేశ్ కూడా నటించాడు. తాజాగా మంచు మోహన్‌బాబు నటిస్తున్న మరో చిత్రంలో ఈ యంగ్‌హీరో మోహన్‌బాబు కొడుకుగా నటిస్తున్నట్లు సమాచారం. ఓ మరాఠి చిత్రం ఆధారంగా రూపొందుతున్న 'మామ మంచు... అల్లుడు కంచు' (వర్కింగ్‌టైటిల్) చిత్రంలో మోహన్‌బాబుకు ఇద్దరు భార్యలుంటారట. వారే మీనా, రమ్యకృష్ణ, ఇందులో రమ్యకృష్ణ కొడుకుగా వరుణ్‌సందేశ్ నటిస్తుండగా, అల్లుడుగా అల్లరినరేష్, కూతురుగా పూర్ణ నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరి ఈ చిత్రమైనా మోహన్‌బాబు, అల్లరినరేష్, వరుణ్‌సందేశ్ వంటి వారికి హిట్టును అందిస్తుందో లేదో చూడాలి...! మొత్తానికి మోహన్‌బాబు మొత్తం ఫ్లాప్ టీంను వెంటేసుకొని ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.