Advertisementt

పవన్‌కళ్యాణ్‌ బర్త్‌డేకి వీళ్ళ హడావిడి ఏమిటో?

Thu 03rd Sep 2015 07:21 AM
pawan kalyan birthday,pawan kalyan birthday on 2nd sept,movie teasers on pawan kalyan birthday  పవన్‌కళ్యాణ్‌ బర్త్‌డేకి వీళ్ళ హడావిడి ఏమిటో?
పవన్‌కళ్యాణ్‌ బర్త్‌డేకి వీళ్ళ హడావిడి ఏమిటో?
Advertisement
Ads by CJ

సాధారణంగా స్టార్‌ హీరోల పుట్టినరోజు వేడుకల్ని అభిమానులు పండగలా చేసుకోవడం, వారి పుట్టినరోజు సందర్భంగా రక్తదానాలు, సేవా కార్యక్రమాలు చేయడం చూస్తుంటాం. అయితే కొంతమంది హీరోలు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి ఇష్టపడరు. అలాంటి వారిలో పవన్‌కళ్యాణ్‌ ఒకడు. అతని పుట్టినరోజును అభిమానులు కూడా ఎక్కువ చేసిన దాఖలాలు కనిపించవు. అయితే ఈసారి కొంతమంది చిన్న నిర్మాతలు మాత్రం పవన్‌కళ్యాణ్‌ పుట్టినరోజును తమకు అనుకూలంగా మలచుకున్నారు. అతని పుట్టినరోజును పురస్కరించుకొని తమ తమ సినిమాల టీజర్‌లను విడుదల చేసి ఆ రకంగా పబ్లిసిటీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి పెళ్ళికో... ఎవరో హడావిడి చేసినట్టుగా ఒకరి బర్త్‌డేకి మరొకరు టీజర్‌లు రిలీజ్‌ చేసుకొని సంబరం పడడం ఏమిటో? అది వారికే తెలియాలి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ