Advertisementt

చరణ్‌ ఏడ్చే సెంటిమెంట్ ఈసారైనా..!

Thu 03rd Sep 2015 12:13 PM
bruce lee,ram charan,govindhudu andarivadele,sentiment  చరణ్‌ ఏడ్చే సెంటిమెంట్ ఈసారైనా..!
చరణ్‌ ఏడ్చే సెంటిమెంట్ ఈసారైనా..!
Advertisement
Ads by CJ

రామ్‌చరణ్‌ను వెండితెర మీద చలాకీగా చూడడమే ఆయన అభిమానులకు ఇష్టం. డాన్సులు, ఫైట్లు, ఫీట్లు చేసి ఫ్యాన్స్‌కు ఆకట్టుకుంటూ వస్తున్నాడు. రామ్‌చరణ్‌కు మాత్రమే కాదు... చిరు, పవన్‌ మినహా అందరు మెగా హీరోలకు సెంటిమెంట్‌తో, ఏడుపు సీన్లలో నటించడంలో అంత ప్రావీణ్యం లేదు అన్నది వాస్తవం. మెగా హీరోలందరూ నవ్విస్తూ ఉంటేనే బాగుంటారని, ఏడిపించడం వారికి చేతకాదనే అపవాదు ఉంది. అయితే ఈ విషయంలో బన్నీ కాస్త బెటర్‌. రామ్‌చరణ్‌ తన కిందటి చిత్రం గోవిండుడు అందరివాడేలే చిత్రంలో ఏడుపు సీన్లు ట్రై చేసినా పెద్దగా వాటిని పండించలేకపోయాడు. ఆ సినిమాలో చరణ్‌ ఏడ్చే సీన్లపై ఫేస్‌బుక్‌లో బోలెడు జోకులు కూడా వచ్చాయి. ఇప్పుడు మళ్లీ బ్రూస్‌లీ లో కూడా చరణ్‌ సెంటిమెంట్‌ను పండించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఓ సన్నివేశంలో కంటతడి పెట్టాడు. ఇప్పుడు ఆ టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. మరి ఈసారైనా తన సెంటిమెంట్‌తో ప్రేక్షకులను మెప్పిసాస్తాడో లేదంటే మరొకొన్ని జోకులు బయటకు వచ్చేలా చేస్తాడో చూడాలి మరి! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ