సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వినాయకుడికి దండం పెడుతున్న ఫోటో ఒకటి ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటోను తీసి నెట్ లో పెట్టిన హీరో మంచు మనోజ్ ఫైనల్ గా వర్మపై దేవుడు గెలిచాడు అంటూ ట్వీట్ కూడా చేశాడు. ప్రస్తుతం మంచు మనోజ్ తో అటాక్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న వర్మ ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇలా గణేశుడికి నమస్కారం చేస్తూ దొరికిపోయాడు. గతేడాది వినాయక చవితి సందర్భంగా గణేశుడిపై ట్విట్టర్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వర్మ ఇలా దేవుడికి మొక్కడంతో అందరూ ఆశ్చర్య పడుతున్నారు. తన తల తెగకుండా కాపాడుకోలేకపోయిన వాడు భక్తులను ఎలా కాపాడతాడు అంటూ ట్వీట్ చేసిన వర్మపై అప్పట్లో చాలామంది తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాంటి వర్మ ఇలా వినాయక చవితి ముందు గణనాథుడికి దండం పెట్టడం నిజంగా విచిత్రమనే చెప్పాలి.