Advertisementt

మారుతిని మామూలుగా పొగడట్లేదు!

Tue 08th Sep 2015 07:48 AM
maruthi,eerojullo,bhale bhale madivoy,kotthajanta  మారుతిని మామూలుగా పొగడట్లేదు!
మారుతిని మామూలుగా పొగడట్లేదు!
Advertisement
Ads by CJ

హిట్టు సినిమా తీయడం దేవుడెరుగు? సినిమా పెట్టుబడి తిరిగొస్తే చాలు అనుకొంటున్న రోజులివి. ముఖ్యంగా చిన్న చిత్రాల నిర్మాల పరిస్థితి అలాగే ఉంది. అయితే దర్శకుడు మారుతి మాత్రం నిర్మాతలకు లాభాల వర్షం కురిపిస్తున్నాడు. ఈరోజుల్లో సినిమాని కేవలం 40లక్షలతో తీసి కోట్లు తెచ్చిపెట్టాడు. బస్‌స్టాప్‌ ది అదే పరిస్థితి. ప్రేమకథాచిత్రమ్‌ చిత్రానికి రెండింతలు లాభం వచ్చింది. ఇప్పుడు భలే భలే మగాడివోయ్‌ దీ ఆదే పరిస్థితి. ఈ సినిమాను 4కోట్లుతో పూర్తి చేశాడు. శాటిలైట్‌ రూపంలో ఆ డబ్బు ఎప్పుడో వచ్చేసింది. ఇక వచ్చిందల్లా లాభమే. తొలిరోజు ఈ చిత్రం 1.75కోట్లు వసూలు చేసింది. ఇక శని, ఆదివారాల్లో అద్బుతమైన కలెక్షన్లు రాబట్టింది. అంటే అల్లుఅరవింద్‌కు లాభాలే లాభాలు. కొత్తజంట తో పోగొట్టుకున్నది అంతకు అంత సంపాదించుకునే చాన్స్‌ దక్కింది. ఇక బూతు చిత్రాల దర్శకుడిగా మారుతిపై ఉన్న అపప్రద తొలిగిపోయిందనే చెప్పాలి. క్లీన్‌ ఎంటర్‌టైనర్స్‌ను కూడా తెరకెక్కించగలనని ఆయన నిరూపించుకున్నాడు. దీంతో మరలా మారుతికి పెద్ద హీరోల చిత్రాలకు కూడా అవకాశాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ