కమెడియన్ గా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకొని అందాల రాముడు, మిస్టర్ పెళ్ళికొడుకు, భీమవరం బుల్లోడు చిత్రాలతో కమర్షియల్ హీరోగా టర్న్ అయ్యాడు సునీల్. అయితే అందాల రాముడు తప్ప మిగిలిన రెండు చిత్రాల ఫలితాలు నిరాశ పరచడంతో తన కెరీర్ ప్రమాదంలో పడింది. ప్రస్తుతం తను నటిస్తున్న కృష్ణాష్టమి సినిమాపై సునీల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
ఇలాంటి సమయంలో సునీల్ కు బంపర్ ఆఫర్ తగిలింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో సునీల్ ను నటించమని మహేష్ అడిగాడట. సునీల్ కూడా వెంటనే ఓకే చెప్పేసాడట. కథలో ఓ కీలకమైన పాత్రలో సునీల్ కనిపించనున్నాడని సమాచారం. ఫ్లాప్ లలో ఉన్న సునీల్ ను పిలిచి మరి మహేష్ అవకాశం ఇవ్వడం మామూలు విషయం కాదు. ఈ విషయంలో మహేష్ ను పొగడాల్సిందే.. మరి ఈ సినిమా సునీల్ కెరీర్ కు ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాలి..!