Advertisementt

చెర్రీకి బన్నీ వార్నింగ్!

Tue 08th Sep 2015 01:59 PM
ram charan,allu arjun,brucelee,stunt master  చెర్రీకి బన్నీ వార్నింగ్!
చెర్రీకి బన్నీ వార్నింగ్!
Advertisement
Ads by CJ

మెగాస్టార్ వారసులు అల్లు అర్జున్, రామ్ చరణ్ లకు ఒకరంటే ఒకరికి విపరీతమైన అభిమానం. ఇండస్ట్రీలో కూడా పోటీ లేకుండా ఒకరి సినిమాను మరొకరు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అయితే రీసెంట్ గా బన్నీ, రామ్ చరణ్ కు ఓ విషయంలో సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలు విషయానికొస్తే ప్రస్తుతం రామ్ చరణ్, శ్రీనువైట్ల దర్శకత్వంలో బ్రూస్ లీ అనే చిత్రంలో స్టంట్ మాస్టర్ పాత్రలో నటిస్తున్నాడు. ఆ పాత్రకు తగినట్లుగానే సినిమాలో రిస్కీ షాట్స్ చేయాల్సివుందట. అయితే డూప్ లేకుండా చరణ్ రిస్కీ షాట్స్ లో నటించాడట. అంత రిస్క్ తీసుకోవద్దని అల్లు అర్జున్, చిరంజీవి తో పాటు కుటుంబ సభ్యులంతా చెప్పినా చరణ్ వినకుండా ఆ షాట్ లో నటించడానికి రెడీ అయ్యాడు. బన్నీ ఎంత చెప్తున్నా చరణ్ పట్టించుకోకపోవడంతో బన్నీ కోపంతో అక్కడ నుండి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మరి బన్నీ ఇచ్చిన వార్నింగ్ ను చరణ్ సీరియస్ గా తీసుకుంటాడో లేదో చూడాలి..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ