కిక్2 డిజాస్టర్ కావడంతో దాని ఎఫెక్ట్ ఇప్పుడే రవితేజ కెరీర్‌పై పడింది. కిక్2లో మరీ బక్కగా చిక్కి ఏదో అనారోగ్యంతో ఉన్నట్లు కనిపించిన రవితేజ మరలా తన పాత లుక్ కోసం ప్రయత్నాలు మొదలెట్టాడు. ఆయన త్వరగా బరువు పెరిగి మరలా తన పూర్వ గ్లామర్ సంపాదించుకోవడంపై దృష్టి పెట్టాడు. కాగా ఆయన ఇప్పుడు బెంగాల్‌టైగర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. కాగా రవితేజ త్వరలో దిల్‌రాజు నిర్మాతగా ఓమై ఫ్రెండ్ దర్శకుడు వేణుశ్రీరామ్‌తో ఓ సినిమా చేయడానికి ఒప్పుకొన్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి దిల్‌రాజు కిక్2 కంటే ముందు అనుకున్న పారితోషికంగా ఇవ్వడానికి ఒప్పుకొన్నాదట. కానీ కిక్2 బోల్తాపడిన తర్వాత దిల్‌రాజు రవితేజకు ఇస్తానన్న రెమ్యూనరేషన్‌లో కోతపెట్టాడట. కానీ రవితేజ మాత్రం కిక్2 కు ముందు తనకు ఇస్తానని చెప్పిన మొత్తమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మరి కిక్2 అనే ఒకే ఒక్క చిత్రం రవితేజ కెరీర్‌నే మాయ చేసిందని చెప్పుకోవాలి...!