Advertisementt

ఆ సినిమాకి అన్నీ సీక్రెట్‌గానే జరుగుతున్నాయి.!

Sat 12th Sep 2015 04:41 AM
telugu movie soggade chinni nayana,nagarjuna new movie soggade chinninayana,lavanya tripathi in soggade chinni nayana  ఆ సినిమాకి అన్నీ సీక్రెట్‌గానే జరుగుతున్నాయి.!
ఆ సినిమాకి అన్నీ సీక్రెట్‌గానే జరుగుతున్నాయి.!
Advertisement
Ads by CJ

చాలా కాలం తర్వాత ఒక విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో, ద్విపాత్రాభినయంతో నాగార్జున చేస్తున్న సోగ్గాడే చిన్నినాయనా చిత్రానికి సంబంధించి అన్నీ సీక్రెట్‌గానే వుంచుతున్నారు. అందరికీ అఫీషియల్‌గా పంపించే న్యూస్‌లో కూడా హీరో, హీరోయిన్లు, డైరెక్టర్‌ పేరు తప్ప మరేదీ మెన్షన్‌ చెయ్యడం లేదు. అలాగే ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌, టీజర్‌లలో కూడా అన్నపూర్ణ స్టూడియోస్‌ బేనర్‌ పేరు, సినిమా పేరు తప్ప మరేమీ కనిపించదు. మరి ఇలాంటి జాగ్రత్తలు ఎందుకు తీసుకున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ సినిమాకి అనూప్‌, థమన్‌ మ్యూజిక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఒక సినిమాకి ఇద్దరు లీడింగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ సంగీతాన్ని అందించడం ఈమధ్యకాలంలో జరగలేదు. ఇలా ఎందుకు చేశారన్నది కూడా సీక్రెటే. 

వీటన్నింటికీ మించిన మరో సీక్రెట్‌ ఏమిటంటే ఈ సినిమాకి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ని మణిశర్మ చేయబోతున్నాడు. ఈ సినిమా పాటలు చేసిన ఇద్దరు మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌లో కూడా నిష్ణాతులే. మరి వాళ్ళని తప్పించి మణిశర్మకు ఛాన్స్‌ ఇవ్వడంలోని ఆంతర్యం ఏమిటో తెలియలేదు. మణిశర్మ ఇప్పుడు ఫామ్‌లో లేడనే విషయం అందరికీ తెలిసిందే. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కోసం దర్శకనిర్మాతలు అతన్ని ఎందుకు అప్రోచ్‌ అయ్యారనేది వారికే తెలియాలి. పైగా దీని కోసం మణిశర్మ 35 లక్షలు డిమాండ్‌ చేస్తున్నాడట. ఆ ఎమౌంట్‌కి ఒక్క పైసా తగ్గేది లేదని భీష్మించుకొని కూర్చున్నాడట. మణిశర్మతోనే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేయించాలని డిసైడ్‌ అయిన దర్శకనిర్మాతలు అతను కోరిన ఎమౌంట్‌ ఇచ్చి చేయించుకుంటారా? లేదా? అనేది డౌటే. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ