ఈమద్య కమర్షియల్ సినిమా అనగానే ఐటమ్‌పాట పెట్టేయడం కామన్ అయిపోయింది. స్టార్‌హీరో సినిమా అనే కాదు... ఏ సినిమా అయినా ఐటెమ్ రోస్ట్ తగలాల్సిందే. అందులోనూ దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు అయితే ఐటమ్ మస్ట్. కాగా పవన్‌కళ్యాణ్ తాజాగా నటిస్తున్న సర్దార్ గబ్బర్‌సింగ్‌లోనూ ఓ ఐటం పాట ఉంది. ఆల్‌రెడీ దేవిశ్రీ ఈ పాటను కంపోజ్ చేసేశాడు. గీత రచయిత ట్యూన్‌కి తగ్గట్లు పాట కూడా రాశాడు. అయతే ఆ పాట వినగానే పవన్‌కు దిమ్మ తిరిగిపోయిందట. ఎందుకంటే ఆ పాట నిండా బూతులే బూతులు ఉండటంతో ఎంత ఐటమ్ పాట అయినా మరీ ఇన్ని బూతులుంటే ఎలా? అంటూ పవన్ ఫైర్ అయ్యాడని సమాచారం. దాంతో ఆ పాటను డస్ట్‌బిన్‌లో పడేసి మరో గీత రచయిత చేత ఈ ఐటమ్ పాటను రాయిస్తున్నారు. ఈ విషయంలో పవన్ ఎంత కేర్‌ఫుల్‌గా ఉంటాడో దర్శకుడు బాబీకి, సంగీత దర్శకుడు దేవిశ్రీకి తెలిసొచ్చింది అంటున్నారు.