ఇప్పుడంతా టెక్నాలజీని తెగ వాడేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా సినిమా వాళ్లు టెక్నాలజీతో, సర్జరీలతో లేని అందాలను కూడా కొని తెచ్చుకొంటున్నారు.అప్పటికప్పుడు ఈ సర్జరీల ఎఫెక్ట్ అంతగా కనిపించకపోయినా, భవిష్యత్తులో మాత్రం చాలా గట్టి దెబ్బతినే అవకాశం ఉందని మాజీ హీరోయిన్ జ్యోతిక సూటిగా కామెంట్ చేసింది. సర్జరీల వల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ముఖ కవళికలపై కూడా ఆపరేషన్ ప్రభావం ఎక్కువగా పడుతుందని జ్యోతిక అంటోంది. అందం అనేది సహజంగా రావాలని, స్వచ్చమైన నవ్వులో అందం ఉంటుందని, అంతే తప్ప సర్జరీలతో అందం రాదని చురకలు వేసింది ఆమె. ఎప్పుడూ ఎవ్వరినీ నొప్పించని జ్యోతిక ఇలా సర్జరీలపై, ప్లాస్టిక్ ముఖాలపై ఎందుకు విరుచుకుపడిందో, ఈ వ్యాఖ్యలు ఎవరిపైన వేసిందో తమిళ జనాలకు అర్థం కావడం లేదు.