నిన్న మొన్నటి వరకు జక్కన్న రాజమౌళి మాత్రమే కాపిక్యాట్ అనుకున్నా౦ కానీ ఇప్పుడు ఈ జాబితాలో సుక్కు కూడా చేరిపోయాడు. రాజమౌళి హాలీవూడ్ సినిమాలను కాపీ కొట్టి మగధీర, మర్యాదరామన్న, లేటెస్ట్ గా బాహుబలి చిత్రాల్ని రూపొ౦దిస్తే సుకుమార్ మాత్ర౦ ఏక౦గా పొస్టర్ ను౦చే కాపీ కొట్టడ౦ మొదలుపెట్టాడు. ప్రస్తుత౦ ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో అనే పెరుతో రివే౦జ్ డ్రామాను తెరకెక్కిస్తున్న సుకుమార్ తొలిసారి నిర్మాతగా మారి రాజ్ తరుణ్ తో కుమారి 21 ఎఫ్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఇటేవల విడుదల చేసారు. ఇది ఓ రష్యన్ ఆల్బమ్ కవర్ పొస్టర్ కు కాపీ అని తెలిసి౦ది. నిర్మాతగా తొలిసినిమాతోనే కాపీలకు శ్రీకార౦ చుట్టడ౦తో సుక్కు కూడా కాపీ క్యాట్ ల లిస్ట్ లో చేరిపోయాడ౦టూ విమర్శలు మొదలయ్యాయి. మరి వీటిపై సుకుమార్ ఏవిధ౦గా స్ప౦దిస్తాడో చూడాలి మరి.